గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. మోర్బీ ప్రాంతంలో కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జ్

Gujarat Bridge Collapse: బ్రిడ్జ్‌పై నుంచి నదిలో పడ్డ సందర్శకులు

Rama Rao
Published on: 30 Oct 2022 8:45 PM IST
Cable Bridge Collapses in Gujarat |  Telugu News
X

గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. మోర్బీ ప్రాంతంలో కుప్పకూలిన కేబుల్‌ బ్రిడ్జ్

Gujarat Bridge Collapse: గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మచ్చూ నదిపై నిర్మించిన బ్రిడ్జిపై బ్రిడ్జిపై నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను మోహరించారు. ఈ ఘటనలో భారీ సంఖ్యలోనే సందర్శకులు నదిలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ బ్రిడ్జికి ఆధునికీకరణ పనులు చేపట్టాక ప్రారంభమైన ఐదు రోజులకే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తంచేశారు. తీగల వంతెన కూలిపోయిన విషయం తెలిసి గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు పలువురు అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను తరలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్టు పీఎంవో కార్యాలయం తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story