Cabinet Expansion 2021: చరిత్ర సృష్టించిన కిషన్ రెడ్డి

Cabinet Expansion 2021: కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 7 July 2021 7:13 PM IST
Cabinet Expansion 2021: G Kishan Reddy Take Oath as Cabinet Minister
X

Cabinet Expansion 2021: చరిత్ర సృష్టించిన కిషన్ రెడ్డి

Cabinet Expansion 2021: కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. తాజాగా ఆయనకు కేబినెట్ మంత్రి హోదా దక్కింది. ఆయన పనితీరును మోదీ పరిగణనలోకి తీసుకొని, ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయ‌డంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కార్య‌క‌ర్త‌లు సంబరాలు జ‌రుపుకున్నారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story