కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

MSP Hike: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Oct 2024 4:15 PM IST
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
X

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు

MSP Hike: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా పీఎం అన్నదాత ఆయ్‌ సంరక్షణ్‌ అభియాన్‌కు 35వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. రబీ పంట సీజన్‌కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువులకు 24 వేల 475 కోట్ల సబ్సిడీకి పచ్చజెండా ఊపింది.

2025-26 సంవత్సరానికి గాను గోధుమ సహా ఆరు పంటలకు కనీస మద్దతు ధర ను పెంచింది. క్వింటాల్‌ గోధుమపై ఎంఎస్‌పీని తాజాగా 150కు పెంచడంతో గతంలో 2 వేల 275గా ఉన్న కనీస మద్దతు ధర 2 వేల425కి పెరిగినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story