West Bengal: పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్

* భవానీపూర్, జాంగీపూర్, సంషేర్‌గంజ్‌ నియోజకవర్గాలకు పోలింగ్ * ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్లు

Sandeep Reddy
Published on: 30 Sept 2021 10:46 AM IST
Bypoll is Going on in West Bengal Today 30 09 2021
X

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ (ఫైల్ ఫోటో)

West Bengal: పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ అందరి దృష్టి భవానీపూర్‌ నియోజకవర్గంపైనే ఉంది. అక్కడ నుంచి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. అయినప్పటికీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికవకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మమత.

భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్, సీపీఎం నుంచి శ్రీబిజ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంలేదు. భవానీపూర్‌లో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ గతంలో రెండు సార్లు గెలిచారు. మూడోసారి కూడా గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story