Uttarakhand: అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

Bus Falls Into Alakananda River In Uttarakhand
x

Uttarakhand: అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు

Highlights

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు అలకనంద నదిలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఘోల్తీర్ ప్రాంతం వద్ద ఆదివారం జరిగింది.

అధికారుల వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలుయ్యాయి. అయితే, మిగిలిన 10 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. అయితే, ప్రాంతంలో భారీ వర్షాలు పడుతుండటంతో నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీని వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారిని వెలికితీసేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది (SDRF), పోలీసులు సహకారంతో చర్యలు చేపట్టారు.

ప్రమాద సమయంలో బస్సు ఎందుకు నియంత్రణ తప్పిందన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రమాద వివరాలు వెలుగులోకి వస్తున్న కొద్ది.. స్థానికులు, అధికారులు తీవ్రంగా కలత చెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories