ఘోర ప్రమాదం.. నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి

Bus Carrying ITBP Jawans, Cops Falls Into River in J&Ks Pahalgam
x

ఘోర ప్రమాదం.. నదిలో పడిన జవాన్ల బస్సు.. ఆరుగురు మృతి

Highlights

ITBP Jawans: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

ITBP Jawans: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసు సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అనంతనాగ్ జిల్లాలో చందన్‌వారీ పహల్‌గామ్‌ దగ్గర్లోని ఫ్రిస్లాన్ గ్రామం దగ్గర నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఎయిర్‌ అంబులెన్స్‌ల్లో శ్రీనగర్‌కు తరలించారు. ఈ భద్రతా సిబ్బంది అమర్‌నాథ్ యాత్ర విధులను ముగించుకుని చందన్‌వారీ నుంచి పహల్‌గామ్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories