Meghalaya Bus Accident: నదిలో పడిన బస్సు.. ఆరుగురి దుర్మరణం

* ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని పోలీసులు చెప్పారు

Sandeep Reddy
Updated on: 30 Sept 2021 12:45 PM IST
Bus Accident at Nongchram Ringdi River in Meghalaya
X

నదిలో పడిన బస్సు (ఫోటో: హిందూస్తాన్ టైమ్స్)

Meghalaya Bus Accident: మేఘాలయలో గురువారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మేఘాలయ లోని తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు అర్దరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది.ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించారని పోలీసులు చెప్పారు.

ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని పోలీసులు చెప్పారు. సహాయ సిబ్బంది రంగంలోకి దిగి 16 మంది ప్రయాణికులను రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలను బస్సులో నుంచి వెలికితీశారు. మరో రెండు మృతదేహాలు బస్సులో ఉన్నాయి. మృతుల్లో బస్సు డ్రైవరు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story