Building Collapses: ముంబై నాయక్‌నగర్‌లో కూలిన భవనం

Building Collapses: అర్ధరాత్రి కుప్పకూలిన 4 అంతస్థుల భవనం

Rama Rao
Updated on: 28 Jun 2022 10:37 AM IST
Building Collapses in Mumbai | Mumbai News
X

Building Collapses: ముంబై నాయక్‌నగర్‌లో కూలిన భవనం

Building Collapses: ముంబై నాయక్ నగర్ లో రాత్రి నాలుగు అంతస్తుల భవనం కూప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బిల్డింగ్ కూలిన ఘటనలో సమాచారం అందుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అర్థరాత్రి పన్నెండున్నర ప్రాంతంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. వెంటనే స్పందించిన బీఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద సుమారు 20 నుంచి 25 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరి కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story