ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

Building Collapses: మహారాష్ట్రలో నాలుగంత‌స్తుల‌ భ‌వ‌నం కుప్ప‌కూలింది.

Arun Chilukuri
Updated on: 19 Aug 2022 9:45 PM IST
Building Collapses in Borivali West in Mumbai
X

ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

Building Collapses: మహారాష్ట్రలో నాలుగంత‌స్తుల‌ భ‌వ‌నం కుప్ప‌కూలింది. ముంబై బోరివాలి ప్రాంతంలోని సాయిబాబాన‌గ‌ర్‌లో గీతాంజ‌లి బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలుతున్న సమయంలో భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణ‌న‌ష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పటికే అందులోని నివాసితులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనం అకస్మాత్తుగా కూలుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story