ఉభయ సభల్లో ఆర్థిక సర్వే.. రేపటికి ఉభయ సభలు వాయిదా..

Budget Session 2022 Parliament Both Houses Adjourned till Tomorrow
x

ఉభయ సభల్లో ఆర్థిక సర్వే.. రేపటికి ఉభయ సభలు వాయిదా..

Highlights

Budget Session 2022: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Budget Session 2022: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సెంట్రల‌్‌ హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం లోక్‌సభలో ఆర్థిక సర్వేను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. సర్వే రిపోర్ట్‌ మొబైల్‌ యాప్‌లో హిందీ, ఇంగ్లీషు భాషల్లో అందుబాటులో ఉన్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

అనంతరం చైర్మన్‌ వెంకయ్య నాయుడి నేతృత్వంలో రాజ్యసభ ప్రారంభమైంది. ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. మొబైల్‌ యాప్‌లో సర్వే రిపోర్టు అందుబాటులో ఉందని తెలిపిన చైర్మన్‌ అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories