Budget 2026: నా చీరల గురించి ఎందుకు? బడ్జెట్ అంశాల మీద దృష్టి పెట్టండి: నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు!

Budget 2026: ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపై సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది.

Arun Chilukuri
Published on: 2 Feb 2026 11:52 AM IST
Budget 2026: నా చీరల గురించి ఎందుకు? బడ్జెట్ అంశాల మీద దృష్టి పెట్టండి: నిర్మలా సీతారామన్ ఘాటు వ్యాఖ్యలు!
X

Budget 2026: ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపై సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంది. అయితే, ఈసారి ఈ చర్చలపై మంత్రి సీతారామన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ ముఖ్యాంశాల కంటే తన చీరపైనే ఎక్కువ దృష్టి పెట్టడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

అసలు బడ్జెట్ ఏది?

తాజాగా బడ్జెట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. "ప్రతి ఏడాది బడ్జెట్ రోజున నేను ఏం కట్టుకోబోతున్నాను అనే ప్రశ్నలు నాకు ఒత్తిడిని కలిగిస్తున్నాయి. అసలు నన్ను ఇలాంటి ప్రశ్నలతో ఎందుకు వేధిస్తున్నారు? ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులైతే.. వారి దుస్తుల గురించి కూడా ఇలాగే చర్చలు జరుపుతారా?" అని సూటిగా ప్రశ్నించారు. నేను ధరించే చీరను కూడా బడ్జెట్‌లో ఒక అంశంగా మార్చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

కాంచీపురం చీరతో రాజకీయ చర్చలు:

ఈసారి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ గోల్డెన్ అంచు ఉన్న మెజెంటా రంగు 'కాంచీపురం' సిల్క్ చీరను ఎంచుకున్నారు. ఇది తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉంది. అయితే, మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆమె ఈ చీరను ఎంచుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నెట్టింట జరుగుతున్న విశ్లేషణలకు ఆమె తన వ్యాఖ్యలతో చెక్ పెట్టారు.

"ప్రజలు బడ్జెట్‌లో ఏముంది అనే విషయాలపై దృష్టి పెట్టాలి. అనవసరమైన విషయాలపై ఆలోచించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక అంశాలపై పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది" అని ఆమె హితవు పలికారు. సంప్రదాయాన్ని గౌరవించడం వరకు బాగున్నా, దాన్నే ప్రధానాంశంగా మార్చడం పట్ల ఆమె తన నిరసనను వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story