Union Budget 2021: సీనియర్‌ సిటిజన్లకు ఊరట

Arun Chilukuri
Updated on: 1 Feb 2021 1:30 PM IST
Union Budget 2021: సీనియర్‌ సిటిజన్లకు ఊరట
X

బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సీనియర్‌ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. సీనియర్‌ సిటిజన్లు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పెన్షన్‌, పన్ను ఆదాయాలు మాత్రమే కలిగిన 75 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఐటీ రిటన్స్‌ దాఖలు చేయడం నుంచి మినహాయింపు వర్తిస్తుంది. పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50లక్షల లోపు ఆదాయం, రూ.10లక్షల లోపు వివాదాలు ఉన్నారు నేరుగా కమిటీకి అప్పీల్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story