BSF Jawan shoots down five intruders: అక్రమ చొరబాటుదారులు హతం.. కాల్చి చంపిన భారత్ సైన్యం

BSF Jawan shoots down five intruders: అక్రమ చొరబాటుదారులు హతం.. కాల్చి చంపిన భారత్ సైన్యం
x

BSF shoots down 5 intruders

Highlights

BSF Jawan shoots down five intruders: ఎన్ని దఫాలుగా హెచ్చరికలు చేస్తున్నా అక్రమ చొరబాటుదారులు పట్టించుకోవడం లేదు. యధాతధంగా వారు భారత్ భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు

BSF Jawan shoots down five intruders: ఎన్ని దఫాలుగా హెచ్చరికలు చేస్తున్నా అక్రమ చొరబాటుదారులు పట్టించుకోవడం లేదు. యధాతధంగా వారు భారత్ భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఈ వ్యవహారాన్ని తిప్పికొడుతున్నాయి భారత్ సైన్యం. శ్రీనగర్లో జరిగిన ఈ చొరబాటుదారులు లొంగిపోవాలని చెబుతున్నా వినకపోవడం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని సైన్యం పేర్కొంది.

పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు అక్రమ చొరబాటుదారుల్ని భారత సైన్యం శనివారం కాల్చి చంపింది. పంజాబ్ జిల్లాలోని తర్నాతరణ్‌ ప్రాంతం నుంచి ఈ ఐదుగురూ అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని గమనించిన భారత జవాన్లు ఈ అక్రమ చొరబాటు దార్లను కాల్చి చంపేశారు. ఈ ఐదుగురూ పాక్ తీవ్రవాదులేనని అధికారులు పేర్కొన్నారు.

అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించే క్రమంలో లొంగిపోవాలని తాము కోరామని, అయినా సరే ఆ అక్రమ చొరబాటు దారులు వినకపోవడంతో వారిపై కాల్పులు ప్రారంభించామని, ఐదుగురు మరణించారని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరి దగ్గరి నుంచి ఏకె -47తో పాటు ఆయుధాలతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు బీఎస్‌ఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనతో సరిహద్దుల వెంబడి ఆర్మీ మరింత నిఘాను పెంచింది.

దీని కంటే కొద్ది రోజుల ముందు కూడా అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గుజరాత్ -రాజస్థాన్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశించాలని అక్రమ చొరబాటుదార్లు ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన జవాన్లు వారిని కాల్చి చంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories