ఢిల్లీలో ఇవాళ BRS కార్యాలయం ప్రారంభం

* పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ పార్టీల నాయకులకు ఆహ్వానం

R Tripura Malini
Published on: 14 Dec 2022 6:18 AM IST
BRS Office Inaugration In Delhi Today
X

ఢిల్లీలో ఇవాళ BRS కార్యాలయం ప్రారంభం

BRS: దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాజకీయాలు చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. ఢిల్లీలో ఈరోజు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాజకీయాల్లో విజయవంతంగా రాణించాలని రాజశ్యామల యాగం చేశారు. ఈరోజు యాగపూజల అనంతరం కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మూడు యజ్ఞ కుండలాల్లో 12 మంది రుత్వికులతో యాగపూజలు నిర్వహించారు. భారత్‌ రాష్ట్ర సమితి విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగంలో సంకల్ప పూజానివేదన చేశారు.

ఇక పార్టీ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులను ఆహ్వానించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్, అక్కడ బీఆర్ఎస్ కార్యకలాపాలను మొదలు పెట్టడానికి పార్టీ ఆఫీసులు తెరవనున్నారు. విజయవాడలోనూ బీఆర్ఎస్ కార్యాలయం నిర్మాణానికి భూముల కోసం ఆ పార్టీ నేతలు గాలిస్తున్నారు. త్వరలోనే ముంబై, బెంగళూరులో కార్యాలయాలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story