logo
జాతీయం

పెళ్లి పందిట్లో ఊడిపోయిన వ‌రుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన వధువు

Bride Refuses to Marry Bald Groom in Uttar Pradesh
X

పెళ్లి పందిట్లో ఊడిపోయిన వ‌రుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన వధువు

Highlights

Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నావ్‌లో ఓ పెళ్లి కుమారుడు తనకు బట్టతల ఉందన్న నిజాన్ని, పెళ్లి కూతురు, ఆమె తరపు బంధువులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.

Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నావ్‌లో ఓ పెళ్లి కుమారుడు తనకు బట్టతల ఉందన్న నిజాన్ని, పెళ్లి కూతురు, ఆమె తరపు బంధువులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అతని ప్లాన్ అంతా రివర్స్ అయింది. వివాహ వేడుకలో భాగంగా కార్యక్రమాల్లో పాల్గొన్న పెళ్లి కొడుకు అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అత‌డిని లేపేందుకు పెళ్లికూతురు సోదరుడు ముఖంపై నీళ్లు చల్లి, తలపాగా తీయ‌బోయాడు.

అదే స‌మ‌యంలో వ‌రుడి విగ్గు ఊడిపోయింది. పెళ్లి కూతురు బంధువులు అంద‌రూ షాకయ్యారు. పెళ్లి కొడుకుకి బ‌ట్ట‌త‌ల ఉంద‌ని త‌మ‌కు ముందుగా ఎందుకు చెప్ప‌లేద‌ని, ఇంత మోసం చేస్తారా? అంటూ నిల‌దీశారు. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని పెళ్లికూతురు స్ప‌ష్టం చేసింది. దీంతో ఇరు కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు వెంట‌నే పెళ్లి వేడుక వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఇరు కుటుంబాలను స‌ముదాయించి, గొడ‌వ‌ను ఆపారు. చివ‌రి నిమిషంలో పెళ్లి ర‌ద్దు కావ‌డంతో వ‌రుడు తీవ్ర నిరాశ చెందాడు.

Web TitleBride Refuses to Marry Bald Groom in Uttar Pradesh
Next Story