Bride murdered in beauty parlour : పెళ్లికి గంటల ముందు బ్యూటీపార్లర్‌లో వధువు దారుణ హత్య

Bride murdered in beauty parlour : మధ్యప్రదేశ్‌లోని రత్లం జిల్లాలో పెళ్లికి రెండు గంటల ముందు బ్యూటీ పార్లర్‌లో వధువు హత్యకు గురైంది.

Raj
By Raj
Published on: 6 July 2020 8:15 PM IST
Bride murdered in beauty parlour : పెళ్లికి గంటల ముందు బ్యూటీపార్లర్‌లో వధువు దారుణ హత్య
X

Bride murdered in beauty parlour : మధ్యప్రదేశ్‌ లోని రత్లం జిల్లాలో పెళ్లికి రెండు గంటల ముందు బ్యూటీ పార్లర్‌లో వధువు హత్యకు గురైంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన నివేదిక ప్రకారం, ఈ హత్యలో ఆమె మాజీ ప్రేమికుడు రామ్ యాదవ్ పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి ఆమె గొంతు కోసి రాజస్థాన్‌కు పారిపోయాడని పోలీసులు ఆరోపించారు. ఈ నేరంలో తనకు సహాయం చేసి, సరిహద్దు దాటడానికి సహాయం చేసిన నిందితుడి స్నేహితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. బాధితురాలిని సోను యాదవ్‌గా గుర్తించారు. షాజాపూర్ జిల్లాలో నివసిస్తున్న సోను యాదవ్ పెళ్లి రోజు ఉదయం తన కుటుంబంతో కలిసి జౌరా పట్టణానికి వచ్చింది. కొంత సమయం తరువాత, ఆమె తన బంధువుతో కలిసి బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళింది. ఆమె పార్లర్‌కు చేరుకున్న వెంటనే,మాజీ ప్రేమికుడు రామ్ యాదవ్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి, కాని ఆమె అతని కాల్స్ ను పట్టించుకోలేదు. ఆ తరువాత రామ్ యాదవ్ తన స్నేహితుడి మొబైల్ నంబర్ నుండి సోనుకు ఫోన్ చేసి.. ఆమె బ్యూటీపార్లర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాడు.

వెంటనే అక్కడికి వెళ్లి సోనూ గొంతు కోశాడు. క్షణాల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి బంధువు పోలీసు లకు ఫిర్యాదు చేశారు. ఇక అంతకుముందే సోనును హత్య చేసిన అనంతరం, రామ్ యాదవ్ తన స్నేహితుడు పవన్ పంచల్ బైక్ మీద పారిపోయాడు. పంచల్.. నిందితుడిని రాజస్థాన్ లోని బస్ స్టాప్ వద్ద వదిలాడు. రత్లం నుండి రాజస్థాన్ సరిహద్దు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల పంచల్‌ తిరిగి రత్లం వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతని సహాయంతో నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. పంచల్ వెల్లడించిన వివరాల ప్రకారం, షాజాపూర్‌ నివాసి అయిన సోనూ యాదవ్‌ కు మూడేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో రామ్‌ యాదవ్‌ తో పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. అనంతరం విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో తనకు ఆ యువతి దక్కలేదన్న అక్కసుతోనే ఈ దారుణానానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Raj

Raj

Next Story