రెచ్చిపోయిన కిడ్నాపర్స్.. కాసేపట్లో వివాహం అనగా వధూవరుల కిడ్నాప్

Ludhiana: ఓ వైపు మంగళ వాయిద్యాలు మరోవైపు బంధువుల కోలాహలం ఇంతలోనే ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన విలన్స్..

Arun Chilukuri
Updated on: 28 July 2021 9:00 PM IST
Bride and Groom kidnapped Before Marriage in Ludhiana
X

రెచ్చిపోయిన కిడ్నాపర్స్.. కాసేపట్లో వివాహం అనగా వధూవరుల కిడ్నాప్

Ludhiana: ఓ వైపు మంగళ వాయిద్యాలు మరోవైపు బంధువుల కోలాహలం ఇంతలోనే ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చిన విలన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని ఘటన.! మరికొన్ని క్షణాల్లోనే తాళికట్టు శుభవేళ అని సాంగ్ వినిపించాల్సిన సమయంలోనే వధూవరులిద్దరు కిడ్నాప్ అయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లోని లూథియానాలో జరిగింది. పెళ్లికి అన్నీ సిద్ధమైన వేళ కళ్యాణ మండపంలోకి ఎంట్రీ ఇచ్చిన ముగ్గురు కిడ్నాపర్లు సినీ ఫక్కీలో పెళ్లికొడుకు, పెళ్లికూతురిని ఎత్తుకెళ్లిపోయారు.

మరోవైపు కిడ్నాప్ సమయంలో అడ్డుకోబోయిన వారిపై కిడ్నాపర్స్ దాడికి దిగేందుకూ వెనుకాడలేదు. రెండు చేతుల్లో ఆయుధాలతో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయారు. లూథియానాలోని గురుద్వారా సాహిబ్‌లో జరిగిన ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం ముగ్గురు కిడ్నాపర్స్, మూడు కార్లలో వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. దుండగుల దగ్గర వెపన్స్ ఉండడంతో వారిని ప్రొఫెనల్స్‌గా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కిడ్నాపర్స్ ఎవరు ఎందుకు వధూవరులను కిడ్నాప్ చేశారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story