భారత్ జోడో యాత్రకు బ్రేక్‌.. తాత్కాలికంగా నిలిపివేసిన రాహుల్‌

Rahul Gandhi: కశ్మీర్‌లోని ఖాజీగుండ్‌లో యాత్రను ఆపిన రాహుల్‌

Jyothi
Published on: 27 Jan 2023 7:45 PM IST
Break for  Rahul Gandhi Bharat Jodo Yatra
X

భారత్ జోడో యాత్రకు బ్రేక్‌.. తాత్కాలికంగా నిలిపివేసిన రాహుల్‌

Rahul Gandhi: భారత్​ జోడో యాత్రకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ యువనేత రాహుల్​గాంధీ తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతను కల్పించడంలో పోలీసులు విఫలమైనందున... కశ్మీర్‌లోని ఖాజీగుండ్‌లో యాత్రను ఆపినట్లు రాహుల్ ప్రకటించారు. 11 కిలో మీటర్లు యాత్ర చేయాల్సి ఉండగా.... రద్దీని నియంత్రించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదని... అందుకే కిలోమీటర్‌లోపే యాత్రను నిలిపివేశానని రాహుల్ తెలిపారు. తన భద్రతా సిబ్బంది సూచనల మేరకు పాదయాత్రను విరమించుకున్నానని స్పష్టం చేశారు. అయితే రాహుల్ భారత్​ జోడో యాత్రలో ఎటువంటి భద్రతా లోపం లేదని జమ్ముకశ్మీర్ పోలీసు అధికారి తెలిపారు. బనిహాల్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు పాదయాత్రలో పాల్గొంటున్నట్లు... పోలీసులకు జోడో యాత్ర నిర్వాహకులు ముందుగా సమాచారం ఇవ్వలేదని అన్నారు. పోలీసులు.. జోడో యాత్రకు పటిష్ఠమైన భద్రతను కల్పిస్తున్నారని స్పష్టం చేశారు.

Jyothi

Jyothi

Next Story