Corona Updates: కరోనా మరణాల్లో రెండో స్థానంలో బ్రెజిల్

Representational Image
Corona Updates: ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే నమోదు అవుతున్నాయి.
Corona Updates: ఇపుడిపుడే కోవిడ్ నుండి ప్రపంచంలోని కొన్ని దేశాలు తేరుకుంటుండగా మరి కొన్ని దేశాలను ఆ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. అలాంటి దేశాల్లో బ్రెజిల్ ఒకటి. బ్రెజిల్లో కరోనా తో రోజుకి సగటున 2 వేల మంది ప్రాణాలను కోల్పోతున్నారంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 2,59,271 మరణాల నమోదు అయ్యాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనాని కట్టడి చేయడంలో విఫలం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్కులు తప్పనిసరి చేయకపోగా, లాక్‌డౌన్ విధించడానికి విముఖత చూపించారు. దీంతో ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో కోవిడ్ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లను ఇస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు..?
23 May 2022 6:14 AM GMTవిశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMT
పెళ్లి పందిట్లో ఊడిపోయిన వరుడి విగ్గు.. వివాహం వద్దని వెళ్లిపోయిన...
23 May 2022 12:00 PM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి...
23 May 2022 11:14 AM GMTపోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMT