Parliament: ఆరు రోజుల ముందే పార్లమెంటు వాయిదా..

Both Houses of Parliament Adjourned Week Before Schedule
x

Parliament: ఆరు రోజుల ముందే పార్లమెంటు వాయిదా..

Highlights

Parliament: పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి.

Parliament: పార్లమెంటు ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. నిర్ణీత గడువు కంటే ఆరు రోజుల ముందుగానే ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే ఆరు రోజులు ముందుగానే నిరవదిక వాయిదా పడ్డాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యుల సూచనల మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిలర్లా ఆద్వర్యంలో అన్ని పార్టీల అగ్రనేతలతో కూడిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సభను వారం రోజుల ముందుగా వాయిదా వేయాలన్న తీర్మానాన్ని ఆమోదించారు.

ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తునే.. ఈ సమావేశాలలో 97 శాతం ఉత్పాదకత రేటు నమోదైనట్టు తెలిపారు. ఇక రాజ్యసభ 258వ సెషన్ కూడా నిర్ణీత షెడ్యూలు కంటే ఆరు రోజుల ముందుగా శుక్రవారం వాయిదా పడింది. చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సభలో తాను భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ వింటర్ సెషన్ లో ఉభయ సభలు మొత్తం 62 గంటల 42 నిమిషాల పాటు పనిచేశాయి. ముఖ్యంగా తవాంగ్ నియంత్రణ రేఖ వద్ద చైనా, భారత్ బలగాల ఘర్షణ అంశం ఉభ సభలను కుదిపేసింది. దీనిపై ప్రభుత్వ సమాధానం చెప్పాలని విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories