రాజధానిలో కలకలం.. నార్త్‌ బ్లాక్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌

దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ కలకలం రేపుతూనే ఉన్నాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 May 2024 9:05 PM IST
Bomb Threat Email To North Block Security Officials Conduct Searches
X

 రాజధానిలో కలకలం.. నార్త్‌ బ్లాక్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌

దేశ రాజధానిలో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా నార్త్‌ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. నార్త్‌ బ్లాక్‌లోని పోలీస్‌ కంట్రోల్ రూంకి ఈ-మెయిల్‌ బెదిరింపు వచ్చింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితోపాటు డాగ్‌ స్క్వాడ్‌, బాంబు నిర్వీర్య బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేదని అధికారులు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story