Ludhiana Blast: పంజాబ్‌ లుథియానా కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి...

Ludhiana Blast: ఉదయం 11 గంటలకు కోర్టు నంబర్‌ 14 సమీపంలోని శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు గుర్తించారు...

Shireesha
Published on: 23 Dec 2021 2:16 PM IST
Bomb Blast at Ludhiana Court Complex Punjab | National News
X

Ludhiyana Blast: పంజాబ్‌ లుథియానా కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి...

Ludhiana Blast: పంజాబ్ లుథియానా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించింది. మూడో అంతస్థులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం 11 గంటలకు కోర్టు నంబర్‌ 14 సమీపంలోని శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు గుర్తించారు.

పేలుడు తీవ్రతకు శిథిలాలు కింద ఉన్న వాహనాలపై పడటంతో ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కోర్టు వద్దకు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణాలపై ఆరా తీస్తున్నారు. కోర్టు వద్ద భద్రతను పెంచారు.

Shireesha

Shireesha

Next Story