Rajasthan: గో మరణాలపై ప్రభుత్వం స్పందించడంలేదంటూ బీజేపీ ఆందోళన

Rajasthan: ప్రభుత్వం తీరుకు నిరసనగా జైపూర్‌ను దిగ్బంధించిన బీజేపీ శ్రేణులు

Rama Rao
Published on: 20 Sept 2022 3:04 PM IST
BJP Protest in Rajasthan | Telugu News
X

Rajasthan: గో మరణాలపై ప్రభుత్వం స్పందించడంలేదంటూ బీజేపీ ఆందోళన

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో కొన్ని రోజులుగా వింత వ్యాధితో వేల సంఖ్యలో గోవులు మరణిస్తున్నాయి. అయితే గో మరణాలపై ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా జైపూర్‌ను దిగ్భంధించారు. లంపి స్కిన్ వ్యాధి చాలా తీవ్రంగా ఉందని, ప్రతి రోజు పదుల సంఖ్యలో పశువులు చనిపోతున్నట్లు మండిపడుతున్నారు. వేగంగా విస్తరిస్తున్న లంపి వైరస్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Rama Rao

Rama Rao

Next Story