J.P Nadda Comments: కర్ణాటక సీఎం యడియూరప్ప పాలనపై జేపీ నడ్డా ప్రశంసలు

* బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు * సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకున్నారన్న జేపీ నడ్డా

Sandeep Reddy
Published on: 25 July 2021 8:02 PM IST
BJP President J.P Nadda Says About Yediyurappa Has Done a Excellent Work As a Chief Minister of Karnataka
X

జేపీ నడ్డా - యడియూరప్ప

J.p Nadda Comments on Yediyurappa : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగనుందంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప చక్కటి పాలన అందిస్తున్నారని కొనియాడారు. తనకు తానుగానే ఆయన సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలన చక్కబెడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధిష్ఠానం నుంచి తనకు ఆదేశాలు రాగానే తగిన నిర్ణయం తీసుకుంటానని యడియూరప్ప చెప్పడం, యడియూరప్పను కొనసాగించాలని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది వీరశైవ లింగాయత్ మఠాధిపతులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నడ్డా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story