బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

* పార్లమెంట్‌ను కుదిపేస్తున్న అదాని షేర్ల పతనం

Dhatripriya
Published on: 7 Feb 2023 11:08 AM IST
BJP Parliamentary Meeting Held Today
X

బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

BJP Parliamentary Meeting: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. అదాని షేర్ల పతనంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అయింది. పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కోవాలనేదానిపై చర్చిస్తున్నారు నేతలు. అదాని షేర్ల పతనంపై ఉభయసభల్లో చర్చ చేపట్టాలని బీఆర్ ఎస్ , కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది.

Dhatripriya

Dhatripriya

Next Story