కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

Arun Chilukuri
Updated on: 28 Feb 2021 9:00 PM IST
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్
X

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ భేటీ అయ్యారు. సైనిక స్కూళ్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు రాజ్ నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో తొలిసారి సైనిక స్కూళ్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కేంద్రీయ, సైనిక, లా విద్యాలయాల్లో ఓబీసీలకు ఈ ఏడాది నుంచి రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. వేలాది మంది వెనుకబడిన తరగతుల విద్యార్ధులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ నేతృత్వంలో కృషి చేస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story