BJP President JP Nadda: మోడీ రాకతో దేశ రాజ‌కీయాల్లో మార్పు: నడ్డా

BJP President JP Nadda:  మోడీ  రాకతో దేశ రాజ‌కీయాల్లో మార్పు: నడ్డా
x

మోడీ రాకతో దేశ రాజ‌కీయాల్లో మార్పు: నడ్డా

Highlights

BJP President JP Nadda: ప్రధాని నరేంద్ర మోడీ రాక‌తో దేశ రాజ‌కీయ సంస్కృతిలో చాలా మార్పు వ‌చ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 2014 లో మోడీ నాయ‌క‌త్వంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వ‌త రాజ‌కీయాల్లో మార్పు వ‌చ్చింది.

BJP President JP Nadda: ప్రధాని నరేంద్ర మోడీ రాక‌తో దేశ రాజ‌కీయ సంస్కృతిలో చాలా మార్పు వ‌చ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. 2014 లో మోడీ నాయ‌క‌త్వంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వ‌త రాజ‌కీయాల్లో మార్పు వ‌చ్చింది. త‌ద్వారా .. కులసమీకరణలకు బదులు పని తీరు నివేదికతో నాయకులు ప్ర‌జ‌ల ముందుకు వస్తున్నారని అన్నారు.

బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాడిక్కడ జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాక ముందు రాజ‌కీయ నేతలు కులాల పేరుతో , మ‌తాల పేరుతో విద్వేషించుకునే వార‌నీ, సమాజంలో విద్వేషాల‌ను, వైష్యాల‌ను రెచ్చ‌గొట్టేలా ప్రసంగాల్లో చేసేవారని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని అన్నారు.

దేశ‌వ్యాప్తంగా 22 కోట్ల ఇళ్లలోనే మరుగుదొడ్లు నిర్మించ‌మనీ, దీని ద్వారా మ‌హిళ‌ల ఆత్మగౌర‌వాన్ని పెంపొందించుకున్నామ‌ని న‌డ్డా అన్నారు. 370 అధికరణ రద్దుపై మాట్లాడుతూ, 2019లో బీజేపీ, జేడీయూ నేతలను ప్రజలు లోక్‌సభకు పంపారని, ఆ ఎంపీలే పార్లమెంటలో బటన్ నొక్కి మరీ 370 అధికరణ రద్దు చేశారని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories