తనపై నమోదయిన కేసులపై తేజస్వీ సూర్య సెటైర్లు

Arun Chilukuri
Updated on: 27 Nov 2020 5:16 PM IST
తనపై నమోదయిన కేసులపై తేజస్వీ సూర్య సెటైర్లు
X

కేసులు పెట్టి బీజేపీని ఆపలేరని ఆ పార్టీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. రెండు రోజుల కింద హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన.. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సభలో పాల్గొన్నారు. అనుమతి లేకుండా సభ నిర్వహించారంటూ తేజస్వీ సూర్యపై హైదరాబాద్‌ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన తేజస్వీ సూర్య సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు పెట్టుకోండి. ఎన్ని కేసులు పెడితే బీజేపీ అంత బలంగా తయారవుతుందంటూ ట్వీట్ చేశారు. ఇక అటు తేజస్వీపై కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story