సీఎం మమతాబెనర్జీపై బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఫైర్!

పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై విరుచుకుపడ్డారు.

admin
Published on: 12 Dec 2020 12:51 PM IST
సీఎం మమతాబెనర్జీపై బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఫైర్!
X

పశ్చిమబెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై విరుచుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతుందని రూపా గంగూలీ ఆరోపించారు. జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి చేసే శక్తి ఏడుగురు వ్యక్తులకు ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు. గతంలో బీజేపీ నాయకులపై జరిగిన దాడుల కేసుల్లో టీఎంసీ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎంపీ విమర్శించారు.

admin

admin

Next Story