యూపీలో బీజేపీకి మరో షాక్‌.. ఎస్పీలో చేరిన బీజేపీ ఎంపీ కుమారుడు..

Mayank Joshi: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో బీజేపీకి మరో దెబ్బ తగిలింది.

Arun Chilukuri
Published on: 5 March 2022 6:36 PM IST
BJP MP Rita Bahuguna Son Mayank Joshi Joins Samajvadi Party
X

యూపీలో బీజేపీకి మరో షాక్‌.. ఎస్పీలో చేరిన బీజేపీ ఎంపీ కుమారుడు..

Mayank Joshi: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో బీజేపీకి మరో దెబ్బ తగిలింది. బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్‌ జోషి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. అజామ్‌ఘడ్‌లో నిర్వహించిన పార్టీ ప్రచార సభలో ఈ విషయాన్ని ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ప్రకటించారు. లక్నో కంటోన్మెంట్‌ టికెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని ఎంపీ రీటా బహుగుణా జోషి పార్టీ అధిష్ఠానాన్ని కోరినా అంగీకరించలేదు.

అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరిస్తున్నట్టు రీటా బహుగుణ ప్రకటించారు. దీంతో గత్యంతరం లేక ఎస్పీలోకి మయాంక్‌ జోషి వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో పలువురు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్‌లో ఎస్పీ అభ్యర్థి అపర్ణయాదవ్‌పై రీటా బహుగుణ విజయం సాధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story