Lok Sabha 2024: నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం

Lok Sabha 2024: నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Arun Chilukuri
Published on: 24 Jun 2024 10:16 AM IST
BJP MP Mahtab Takes Oath as pro-tem Speaker
X

Lok Sabha 2024: నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం

Lok Sabha 2024: నేడు లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మెహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఎంపీలతో లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించనున్నారు. నేడు, రేపు లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారం పర్వం కొనసాగనుంది.

ఈనెల 26న లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story