సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళన.. సిసోడియాను బర్తరఫ్ చేయాలని డిమాండ్..

Delhi Liquor Scam: ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీపై రాజకీయ పార్టీల మధ్య రచ్చ రగులుతోంది.

Arun Chilukuri
Updated on: 22 Aug 2022 4:15 PM IST
BJP Leaders Protest Near Arvind Kejriwal Residence
X

సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తల ఆందోళన.. సిసోడియాను బర్తరఫ్ చేయాలని డిమాండ్..

Delhi Liquor Scam: ఢిల్లీలో న్యూ లిక్కర్ పాలసీపై రాజకీయ పార్టీల మధ్య రచ్చ రగులుతోంది. ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ మంత్రి మనీశ్ సిసోడియాను ఏ1 నిందితుడిగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సిసోడియాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఢిల్లీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు సివిల్ లైన్స్ ప్రాంతంలోని సీఎం కేజ్రీవాల్ నివాసం దగ్గర నిరసన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఖజానాను దోచుకోవడానికి మద్యం మాఫియాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్కామ్‌లో కేజ్రీవాల్ కింగ్‌పిన్ అంటూ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఇంటింటికీ తిరుగుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అవినీతి, ఎక్సైజ్ కుంభకోణం గురించి చెబుతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story