కరోనా కాటుకు మరో ఎంపీ బలి

కరోనా కాటుకు మరో ఎంపీ బలి
x
Highlights

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. నిన్న కరోనా కారణంగా...

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. నిన్న కరోనా కారణంగా ఏపీలోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూయగా.. తాజాగా మరో బీజేపీ ఎంపీని ఈ కరోనా మహమ్మారి బలి తీసుకుంది. కరోనా వైరస్‌ బారిన పడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ(55) కన్నుమూశారు. కరోనాకు చికిత్స పొందుతూ బెంగళూరు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇక రెండు నెలల క్రితమే అశోక్ గస్తీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. జులై 22న ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీలో చిన్నస్థాయి కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టిన అశోక్ గస్తీని ఆ పార్టీ నాయకత్వం రాజ్యసభకు ఎంపిక చేసింది. రాజ్యసభకు ఎన్నికైన మూడు నెలలలోపే ఆయన కరోనా కారణంగా చనిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories