Karnataka: కోవిడ్‌ శవాలతో కన్నడ బీజేపీ నేతల ప్రచారం

Karnataka: కోవిడ్‌ పేరుతో ప్రచారం పొందే ప్రయత్నం చేసిన కర్నాటక బీజేపీ నేతలు చివరకు నెటిజన్లతో చివాట్లు పెట్టించుకున్నారు.

Arun Chilukuri
Published on: 6 May 2021 1:58 PM IST
BJP Hoarding that Free Food and Refreshments were Arranged for People Attending Funerals
X

Karnataka: కోవిడ్‌ శవాలతో కన్నడ బీజేపీ నేతల ప్రచారం

Karnataka: కోవిడ్‌ పేరుతో ప్రచారం పొందే ప్రయత్నం చేసిన కర్నాటక బీజేపీ నేతలు చివరకు నెటిజన్లతో చివాట్లు పెట్టించుకున్నారు. కోవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం అధికారులు నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద ఉచితంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక బీజేపీ నేతలు పబ్లిసిటీ పిచ్చితో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యడ్యూరప్ప తదితరుల ఫొటోలతో ఫ్లెక్సీ తయారు చేయించారు. శ్మశానానికి దారి...అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా మంచి నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. విషయం పార్టీ పెద్దలకు తెలియడంతో స్థానిక బీజేపీ నాయకులకు క్లాస్‌ తీసుకున్నారు. దీంతో ఉదయం పెట్టిన ఫ్లెక్సీని సాయంత్రానికి తీయించేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story