JP Nadda: ప్రజా సేవ చేయడమే బీజేపీ లక్ష్యం...

JP Nadda: ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం సన్నాహాలు ముమ్మరం చేస్తోంది.

Arun Chilukuri
Updated on: 20 Sept 2022 8:00 PM IST
BJP has Geared up for Gujarat Elections 2022
X

JP Nadda: ప్రజా సేవ చేయడమే బీజేపీ లక్ష్యం...

JP Nadda: ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. అందులోభాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో బిజీబిజీగా గడిపారు. కరోనా మహమ్మారి సమయంలో నాయకులందరూ ఐసోలేట్ అయిన సమయంలో వైద్య సిబ్బంది ప్రజల మధ్య గడిపారని నడ్డా తెలిపారు. కరోనా రోగులకు వైద్య సేవలు చేస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టారని డాక్టర్లు, నర్సులను ఆయన కొనియాడారు. రాజకీయాలు చేయడం కాదు, ప్రజా సేవ చేయడమే బీజేపీ లక్ష్యమని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రధాని మోడీ తీసుకున్న సాహసోపేతమైన చర్యలు సక్సెస్ అయ్యాయన్నారు. రికార్డు స్థాయిలో బూస్టర్ డోసులు కూడా పంపిణీ చేసి కరోనాను కట్టడి చేయగలిగామని నడ్డా చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story