కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ.. ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ ధ్వజం

BJP Doing What Congress did Akhilesh Yadav on IT Raids
x

కాంగ్రెస్‌ బాటలోనే బీజేపీ.. ఐటీ దాడులపై అఖిలేష్ యాదవ్ ధ్వజం

Highlights

Akhilesh Yadav: అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ రైడ్స్ జరగడంపై యూపీలో కలకలం రేగుతోంది.

Akhilesh Yadav: అసెంబ్లీ ఎన్నికల వేళ ఐటీ రైడ్స్ జరగడంపై యూపీలో కలకలం రేగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మద్దతు దారులు, బంధువుల ఇళ్లే టార్గెట్‌గా రైడ్స్ జరగడంపై అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. బెదిరింపు రాజకీయాల్లో బీజేపీ కాంగ్రస్‌ను అనుసరిస్తోందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ఎవరినైనా బెదిరించాలనుకుంటే కేంద్ర సంస్థలను ఉపయోగించుకునేదని, ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుందని అఖిలేష్ ఫైర్ అయ్యారు.

ఇప్పుడు ఐటీ దాడులు.. ఎన్నికలు సమీపిస్తున్నందున ముందు ముందు సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశముందని విమర్శించారు. అయితే ఇలాంటి దాడులతో సైకిల్ (సమాజ్‌వాది పార్టీ ఎన్నికల చిహ్నం) ముందుకు నడపకుండా అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories