BJP: లిక్కర్‌ స్కామ్‌కు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో బీజేపీ ధర్నా

BJP: ఆప్‌ కార్యాలయ సమీపంలో ధర్నాకు నిర్ణయం

Jyothi
Published on: 10 March 2023 9:00 AM IST
BJP Dharna in Delhi Today Against Liquor Scam
X

BJP: లిక్కర్‌ స్కామ్‌కు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో బీజేపీ ధర్నా

BJP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు వ్యతిరేకంగా నేడు బీజేపీ నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యాలయానికి కొద్ది దూరంలో ఉన్న ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ దగ్గర బీజేపీ ధర్నా చేయనుంది. వాస్తవానికి జంతర్‌మంతర్‌లోనే ఈ నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. దీనికి అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు కూడా చేసుకుంది. అయితే.. భారత జాగృతి సంస్థ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ జంతర్‌మంతర్‌లోనే నేడే దీక్ష చేస్తోంది. ముందుగానే అనుమతి కూడా తీసుకుంది.

బీజేపీ నిరసనకు కూడా దరఖాస్తు రావడంతో నిర్వాహకులు భారత జాగృతికి కేటాయించిన స్థలాన్ని కుదించాలనుకున్నారు. కవిత నిర్వాహకుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ నిరసన తెలిపేందుకు ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ ప్రాంతాన్ని ఎంచుకుంది. లిక్కర్‌ కుంభకోణంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ నేతలు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story