Surat Lok Sabha: లోక్‌సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ.. సూరత్‌లో ఏకగ్రీవం

Surat Lok Sabha: గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం ఏకగ్రీవం

Shashank Gullapelli
Updated on: 22 April 2024 8:31 PM IST
BJP Candidate Mukesh Dalal Wins Surat Lok Sabha Seat Unopposed 8 Candidates Withdraw Their Nominations
X

Surat Lok Sabha: లోక్‌సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీజేపీ.. సూరత్‌లో ఏకగ్రీవం

Surat Lok Sabha: ఇంకా లోక్‌సభ ఎన్నికలు పూర్తి కానే లేదు. ఫలితాలు వెలువడనే లేదు. అప్పుడే ఒక లోక్‌సభ సీటును ఖాతాలో వేసుకుంది బీజేపీ. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ స్థానానికి బీజేపీ తరుపున ముఖేష్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్‌ కుభానీలు బరిలో ఉన్నారు. వీళ్లిద్దరు తమ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నీలేష్ కుభానీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు పోటీలో ఉన్న 7గురు స్వతంత్య్ర అభ్యర్ధులు కూడా తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వజ్రాల నగరం సూరత్‌ లోక్ సభ సీటను ఎన్నికల ముందే బీజేపీ ఖాతాలో చేరింది. గుజరాత్ రాష్ట్రంలో మే 7న మూడో విడతలో 26 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ సూరత్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story