Manifesto Committee: బీజేపీ మేనిఫెస్టో కమిటీ.. లిస్ట్ రిలీజ్ చేసిన జేపీ నడ్డా

Manifesto Committee: బీజేపీ అధినాయకత్వం ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది.

Arun Chilukuri
Updated on: 30 March 2024 6:30 PM IST
BJP Announces Manifesto Committee for the Lok Sabha Election
X

Manifesto Committee: బీజేపీ మేనిఫెస్టో కమిటీ.. లిస్ట్ రిలీజ్ చేసిన జేపీ నడ్డా

Manifesto Committee: బీజేపీ అధినాయకత్వం ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్‌గా రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరించనున్నారు. కమిటీ కన్వీనర్‌గా నిర్మలా సీతారామన్‌ను హైకమాండ్ నియమించింది. మేనిఫెస్టో కమిటీలో మొత్తం 27 మంది సభ్యులు ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ఈ జాబితాలో అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, భూపేందర్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్ యాదవ్, వసుంధర రాజే, రవిశంకర్ ప్రసాద్‌లు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story