బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటన..లిస్ట్‌లో ఈటల..

Etela Rajender: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితా విడుదల చేశారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2021 4:35 PM IST
BJP Announce National Working Committee Members
X

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల ప్రకటన..లిస్ట్‌లో ఈటల..

Etela Rajender: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితా విడుదల చేశారు. మొత్తం 80 మందితో బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు జేపీ నడ్డా. ఆంధ్రప్రదేశ్ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు దక్కింది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్, గరికపాటికి అవకాశం కల్పించారు.

బీజేపీ ఆఫీస్ బేరర్లలో డీకే అరుణకు చోటు దక్కింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈటల రాజేందర్, విజయశాంతిలకు అవకాశం కల్పించారు. తమిళనాడు సహా ఇంచార్జ్ గా పొంగులేటి సుధాకర్ రెడ్డి నియామకం అయ్యారు. జాతీయ కార్యవర్గంలో లక్ష్మణ్, మురళీధర్ రావు, కిషన్ రెడ్డి మినహా మిగిలిన వారందరూ కొత్తగా పార్టీ లో చేరిన వారే కావడం విశేషం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story