బ్లాక్ బాక్స్‌ కోసం వెతుకుతున్న ఆర్మీ అధికారులు.. ముంబై పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి బయల్దేరిన రాష్ట్రపతి

Bipin Rawat Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదంతో దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

Arun Chilukuri
Published on: 8 Dec 2021 5:52 PM IST
Bipin Rawat Chopper Crash Army Officers Looking for Black Box
X

బ్లాక్ బాక్స్‌ కోసం వెతుకుతున్న ఆర్మీ అధికారులు.. ముంబై పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీకి బయల్దేరిన రాష్ట్రపతి

Bipin Rawat Chopper Crash: హెలికాప్టర్ ప్రమాదంతో దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనిపై కాసేపట్లో ప్రధాని మోడీ నివాసంలో అత్యవసర భేటీ జరగనుంది. ఇప్పటికే, ముంబై పర్యటనను రద్దు చేసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్క్ కోవింద్ ఢిల్లీకి బయల్దేరారు. ఇదిలా ఉంటే హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ బాక్స్ కోసం అధికారులు వెతుకుతున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో హోమ్‌, రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story