Bikers Escape from Tiger Attack: ముందు, వెనుక పులి మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులు...

Bikers Escape from Tiger Attack: టీవీలో పులిని చూస్తూనే మనం వనికిపోతాం..

Krishna
Updated on: 7 July 2020 2:47 PM IST
Bikers Escape from Tiger Attack: ముందు, వెనుక పులి మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులు...
X

Bikers Escape from Tiger Attack: టీవీలో పులిని చూస్తూనే మనం వనికిపోతాం.. అలాంటిది డైరెక్ట్ గా చూస్తే ఉంటామా? .. ఇక రెండు పులులు అయితే మన పరిస్థితి ఏంటి. ఆ పులి చంపడం ఏమో కాని మనమే గుండె ఆగి చచ్చిపోతాం.. ఇలాగే ఓ ఇద్ద‌రు యువ‌కుల‌కు రెండు పులు‌లు ఎదుర‌య్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఎం జరిగింది అంటే.. బైక్ మీద వెళ్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు మొద‌ట రోడ్డుకి అడ్డంగా ఒక పులి ఎదురుగా వచ్చింది.. దాని నుంచి తప్పించుకునేందుకు వారు మెల్లిగా బైకును వెనుకకు మళ్లించారు. కానీ వెనుక నుంచి మరో పులి వచ్చింది.. ఇక అక్కడ వీడియో తీస్తున్న వారు కూడా వారి పని అయిపోయిందని అనుకున్నారు..

ఆ రెండు పులులు మరింత దగ్గరగా వచ్చాయి. అయినప్పటికీ వారు దైర్యంగా అక్కడే నిలబడి ఉన్నారు. ఆ తర్వాత అక్కడినుంచి ఆ రెండు పులులు సైలెంట్ గా వెళ్ళిపోయాయి. దీనితో వారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న కేర‌ళ‌-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో చోటు చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Krishna

Krishna

Next Story