దేశవ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు

*కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో బైక్ ర్యాలీ

Jyothi
Published on: 6 Aug 2022 1:04 PM IST
Bike Rally in Delhi under the leadership of Union Minister Kishan Reddy
X

దేశవ్యాప్తంగా ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు

Delhi: దేశవ్యాప్తంగా హర్‌ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది ప్రజలు తరలివచ్చి పాల్గొన్నారు. షర్టులపై జాతీయ పతాక చిహ్నాన్ని ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీలోని సిక్ బ్రిగేడ్ ప్రాంతం నుంచి మొదలైన బైక్ యాత్ర నగరంలో ప్రధాన వీధుల గుండా సాగింది. ఆనాడు ఎందరో అమరుల త్యాగాల ఫలితమే ఈనాడు మనం స్వాతంత్ర్య ఫలాలను ఆస్వాధిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అమరులైన వారి త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తు చేసుకొని దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

Jyothi

Jyothi

Next Story