Top
logo

బిహార్‌లో ప్రారంభమైన తొలి దశ పోలింగ్‌

బిహార్‌లో ప్రారంభమైన తొలి దశ పోలింగ్‌
X
Highlights

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. కొవిడ్‌ మహమ్మారి స్వైరవిహారం...

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. కొవిడ్‌ మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న తరుణంలో జరుగుతున్న తొలి అతి పెద్ద ఎన్నికలివి. దీంతో కరోనా నిబంధనల మధ్య ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో వెయ్యి నుంచి 16వందల మంది ఓటర్లు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ప్రతీ పోలింగ్ స్టేషన్‌ను ముందుగానే శానిటైజ్ చేశారు. ఈవీఎం మిషన్లను కూడా శానిటైజ్ చేసిన అధికారులు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల కోసం మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. పోలింగ్ స్టేషన్ ఎంట్రన్స్‌లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఇక 80 ఏళ్లు దాటిన ఓటర్ల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

243 సీట్లున్న శాసనసభకు మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 71 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా నవంబర్‌ 3న 94 సీట్లకు, నవంబర్‌ 7న 78 సీట్లకు పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో వెయ్యి 66 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. జేడీయూ 35, బీజేపీ 29, ఆర్జేడీ 42, కాంగ్రెస్‌ 20, ఎల్‌జేపీ 41 సీట్లలో పోటీ చేస్తున్నాయి. దాదాపు 2 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, జేడీయూ మరో కూటమిగా బరిలోకి దిగాయి. బీజేపీతో దోస్తీ ఓకే కానీ నితీష్‌కు వ్యతిరేకంగా పోరాడతామంటూ ఎన్డీఏ నుంచి ఎల్పీజీ బయటకు వచ్చింది. ఇక నితీష్ కుమార్‌ను అరెస్ట్ చేయిస్తామంటూ చిరాగ్ పాశ్వాన్ చేసిన వ్యాఖ్యలు తొలిదశ ఎన్నికల ముందు హీట్ పుట్టించాయి. అటు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాల అస్త్రాలను ఉపయోగించాయి పార్టీలు. బీజేపీ తరఫున మోడీ పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించగా మహాకూటమి తరపున రాహుల్ పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Web TitleBihar Election 2020: First phase polling begins
Next Story