కరోనా కాటుకు బలైన ఐజి

బీహార్ కరోనా మహమ్మారి ఓ పొలిసు ఉన్నతాధికారిని బలితీసుకుంది. పూర్నియా రేంజ్‌కు చెందిన ఐజి వినోద్ కుమార్ కరోనాతో మరణించారు. పది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్..

Raj
By Raj
Published on: 18 Oct 2020 10:30 AM IST
కరోనా కాటుకు బలైన ఐజి
X

బీహార్ కరోనా మహమ్మారి ఓ పొలిసు ఉన్నతాధికారిని బలితీసుకుంది. పూర్నియా రేంజ్‌కు చెందిన ఐజి వినోద్ కుమార్ కరోనాతో మరణించారు. పది రోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన పాట్నాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రెండు రోజులనుంచి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం చికిత్స కోసం వినోద్ కుమార్ ను ఐజిఎంఎస్‌లో చేర్చారు, అయితే శనివారం రాత్రి 11 గంటలకు ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.

అంతకుముందు బీహార్ మంత్రి మరొకరు కన్నుమూశారు.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ దేవ్ కామత్ శుక్రవారం ఉదయం మరణించారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కూడా కోవిడ్‌ బారినపడి ఇటీవల మరణించారు. ఇదిలావుంటే బీహార్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,619 కు చేరింది.. ఇక మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 990 మంది మరణించారు.

Raj

Raj

Next Story