బీహార్‌లో నితీష్‌ హవా కొనసాగుతుందా.. తేజస్వీ యాదవ్‌కే పట్టం కడతారా..?

బీహార్‌లో నితీష్‌ హవా కొనసాగుతుందా.. తేజస్వీ యాదవ్‌కే పట్టం కడతారా..?
x
Highlights

Bihar Assembly Elections 2020 : ఉత్కంఠభరితంగా సాగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. అక్కడ మూడు దశల్లో ఎన్నికలు జరగగా ఉదయం...

Bihar Assembly Elections 2020 : ఉత్కంఠభరితంగా సాగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. అక్కడ మూడు దశల్లో ఎన్నికలు జరగగా ఉదయం 7గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నికలు జరిగాయి. కరోనా పరిస్థితుల మధ్య కౌంటింగ్ కేంద్రాల‌ను 38 నుంచి 55కు పెంచారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్యలు తీసుకున్నారు. 38 జిల్లాల వ్యాప్తంగా 55 కేంద్రాల్లో 414హాల్స్‌ కౌంటింగ్‌కు సిద్ధం చేశారు అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 59కంపెనీల పారామిల‌ట‌రీ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపారు. స్ర్టాంగ్‌రూమ్‌ల దగ్గర 19 కంపెనీల బ‌ల‌గాలు విధుల్లో ఉన్నాయ్.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా విజయంపై పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం బీజేపీ, జేడీయూ కూటమి అధికారానికి దూరం కానుంది. ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేతృత్వంలోనే మహాఘట్‌బంద్‌ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉన్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూటమికి 125 నుంచి 130 స్థానాలు బీజేపీ, జేడీయూ కూటమికి 90 నుంచి 100 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయ్.

గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌లో స్వల్ప మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాక హంగ్‌ ఏర్పడే అవకాశం సైతం ఉందని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అంచనాలే నిజమై ఒకవేళ హంగ్ ఏర్పడితే కొత్త పొత్తులు కనిపిస్తాయా అంటూ అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. పొత్తులు, ఎత్తులు ఎలా ఉన్నా బిహార్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.

ఇక అటు బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం క్షీణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల సమయంలో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్తున్నారు. లాలూకు డయాలసిస్‌ కొనసాగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంల ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఎప్పటికప్పుడు పరిస్థితులను తెరవెనక నుంచి ఆరా తీశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని అందుకే ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories