గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర పటేల్.. హాజరైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా..

* గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు.

R Tripura Malini
Published on: 12 Dec 2022 5:12 PM IST
Bhupendra Patel Is The 18th CM Of Gujarat
X

గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్ర పటేల్.. హాజరైన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా..

Gujarat CM: గుజరాత్ సీఎంగా రెండోసారి భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ రాష్ట్ర 18వ సీఎంగా భూపేంద్ర పటేల్‎తో ప్రమాణం చేయించారు. వీరితో పాటు 16 మంది ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రధాని మోడీ, అమిత్ షాతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాల సీఎంలు, స్మృతి ఇరాని ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోడీ, గవర్నర్ ఆచార్య ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాగా తాజా ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీ 182 స్థానాల్లో పోటీ చేసి 156 సీట్లలో విజయం సాధించింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story