భోపాల్‌లో కిరాతకం.. 30 సెకన్లలో 27 సార్లు కత్తిపోట్లు..

Bhopal Horror: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 23 Feb 2026 12:51 PM IST
భోపాల్‌లో కిరాతకం.. 30 సెకన్లలో 27 సార్లు కత్తిపోట్లు..
X

భోపాల్‌లో కిరాతకం.. 30 సెకన్లలో 27 సార్లు కత్తిపోట్లు..

Bhopal Horror: మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఇద్దరు మైనర్లు, తమ సహచర విద్యార్థిపై అత్యంత కిరాతకంగా దాడికి తెగబడ్డారు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే 27 సార్లు కత్తితో పొడిచి ప్రాణాపాయ స్థితికి నెట్టారు.

ఘటన వివరాలు:

స్థానిక స్నూకర్ క్లబ్‌లో 16 ఏళ్ల బాలుడు గేమ్ ఆడుతుండగా ఈ దాడి జరిగింది. నిందితులైన ఇద్దరు మైనర్లు ఒక్కసారిగా క్లబ్‌లోకి ప్రవేశించి, బాధితుడు తేరుకునే లోపే విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. క్లబ్ సిబ్బంది వెంటనే స్పందించి రక్తపు మడుగులో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్:

ఈ దాడి ఎంత దారుణంగా జరిగిందంటే.. నిందితులు తాము చేసిన ఘాతుకాన్ని వీడియో తీసి గర్వంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

దాడికి కారణం అదేనా?:

గతంలో తరగతి గదిలో బాధితుడు తమను చెంపదెబ్బ కొట్టాడని, ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక విచారణలో నిందితులు అంగీకరించారు. స్వల్ప కారణానికే తోటి విద్యార్థి ప్రాణాలు తీసేంతగా రెచ్చిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story