Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ ఖాండ్వాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
* పాదయాత్రలో తొలిసారి పాల్గొన్న ప్రియాంక గాంధీ
మధ్యప్రదేశ్ ఖాండ్వాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్ ఖాండ్వాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ ఉదయం బోర్గాన్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమయ్యింది. ఈరోజు పాదయాత్రలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాధ్రా పాల్గొన్నారు. సోదరునితో కలిసి అడుగులో అడుగు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నారు. యాత్ర ప్రారంభమయినప్పటినుంచీ ప్రియాంక పాల్గొనడం ఇదే మొదటి సారి. మేనమామ బాటలో ప్రియాంక కుమారుడు రైహన్ వాద్ర కూడా పాల్గొన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొనడంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చింది. అంతే కాకుండా రైహన్ వాద్రా కూడా యాత్రకు రావడంతో రాజకీయల్లోకి వస్తాడేమోనన్న చర్చకూడా మొదలయ్యింది.
Next Story




