మహమ్మారిపై పోరులో మరో గుడ్ న్యూస్ : అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

మహమ్మారిపై పోరులో మరో గుడ్ న్యూస్ : అత్యవసర వినియోగానికి కోవాగ్జిన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
x
Highlights

మహమ్మారిపై పోరులో మరో గుడ్ న్యూస్. నిన్న ఆక్స్‌ఫర్డ్ ఇవాళ భారత్ బయోటెక్ ! కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో యుద్ధంలో...

మహమ్మారిపై పోరులో మరో గుడ్ న్యూస్. నిన్న ఆక్స్‌ఫర్డ్ ఇవాళ భారత్ బయోటెక్ ! కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో యుద్ధంలో బలం మరింత పెరిగినట్లు అయింది. ఇక అటు దేశవ్యాప్తంగా డ్రైరన్ ఫస్ట్ డే సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ అయింది.

కరోనాకు ఖతమ్ పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోందిప్పుడు ! ఒక్కటికాదు రెండున్నాయ్ ఇప్పుడు ఆయుధాలు మన దగ్గర! ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు కూడా ఆమోదం తెలిపింది. దీంతో మహమ్మారితో యుద్ధంలో మరో అడుగు ముందుకు పడినట్లు అయింది. 70శాతానికి పైగా సమర్థత ఉందని కోవాగ్జిన్ ట్రయల్స్‌లో తెలిసింది. స్వదేశీ టీకాను అందబాటులో తెస్తామని మోడీ కూడా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌కు కూడా ఆమోదం లభించడం జనాల్లో భారీగా ఊరట కలిగిస్తోంది.

ఇక అటు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ కంటిన్యూ అవుతోంది. టీకా వేయడం మినహా అన్ని రకాల ప్రక్రియను అధికారులు పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రైరన్ ఫస్ట్ డే సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణలో కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు.

ఒక్కో కేంద్రంలో 25 నుంచి 30మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. కేంద్రంలోకి టీకా పొందే వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం వరకూ అన్ని దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇక అటు పంపీణీలో భాగంగా కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో మూడు చొప్పున ఎంపిక చేసిన 39 కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగింది.

ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ కోవిడ్ డ్రైరన్ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల ఫోన్లకు శుక్రవారం రాత్రే ఎస్ఎంఎస్ వచ్చింది. దాని ఆధారంగా వ్యాక్సిన్ కేంద్రానికి రావడం నుంచి డమ్మీ టీకా తీసుకునే వరకు ప్రతీ అంశాన్ని పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories